August 21, 2026
Explore
ఆసాంఘికానికి అడ్డా…..పుంగనూరు

ఆసాంఘికానికి అడ్డా…..పుంగనూరు

August 21, 2026 | Andhra Pradesh

  • కర్నాటక నేరాలకు పుంగనూరుతో లింకులు
  • గతంలో ఇక్కడ పొరుగు దేశస్తుల నివాసం , అరెస్ట్
  • తీవ్ర వాదుల సంబంధీకుల అరెస్ట్
  • తాజాగా మాజీ ఎంపి రేవన్న వ్యవహారం తెరపైకి
  • ఆయన జైలులో వాడిన సిమ్‌కార్డు పుంగనూరు వాసులది
  • ఇంత జరుగుతున్న నిద్రపోతున్న నిఘా వ్యవస్థ

పుంగనూరుముచ్చట్లు:

ఎక్కడో ఉన్న ముంబాయిలో తీవ్ర వాదులకు సంబంధించిన వారిని ఇక్కడ అరెస్ట్ చేయడం, ఎక్కడో ఉన్న బంగ్లాదేశీయుడు పుంగనూరు వాసులతో కలసి ఆధార్‌, ఓటరు ఐడి తీసుకుని దర్జాగా జీవిస్తుండగా అరెస్ట్ కాబడ్డాడు. కర్నాటకలో జరిగే చోరీలకు సంబంధించి రీకవరీలు పుంగనూరులో జరుగుతున్నాయి. ఎక్కడెక్కడో జరిగే నేరాలకు మూలాలు పుంగనూరులోనే బయటపడుతున్నాయి. చాలా కాలంగా పుంగనూరులో ప్రజలు ఇలాంటి ఘటనలతో ఉలిక్కి పడుతున్నారు. తాజాగా బెంగళూరు పరప్పన్న ఆగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని దేవగౌడ మనవడు , మాజీ ఎంపి ప్రజ్వల్‌ రేవన్న యథేచ్చగా జైలులో వాడుతున్న వెహోబైల్‌ఫోన్‌ సిమ్‌కార్డులు పుంగనూరు వాసుల పేరుతో ఉండటంతో ఉలిక్కిపడేలా చేసేంది. ఈ వరుస లింకులు బయటపడుతుండటంతో పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. నిఘా వ్యవస్థ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
కర్నాటక సరిహద్దు ప్రాంతమైన పుంగనూరు పాడిపరిశ్రమకు, చింతపండుకు ప్రసిద్ధి. ప్రశాంతతకు నిలయంగా ఉంది. అలాంటి పట్టణం నేడు నిత్యం వార్తలొకెక్కుతోంది. మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, మాజీ ఎంపి ప్రజ్వల్‌ రేవన్న లైంగిక వేదింపుల కేసులో కర్నాటకలోని పరప్పన్న అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. జైలు తనిఖీలలో రేవన్న వద్ద సెల్‌ఫోన్‌ లభించింది. ఆ సిమ్‌కార్డు పుంగనూరుకు చెందిన స్టార్‌ వెహోబైల్స్ యజమాని నూర్‌అహమ్మద్‌ , అతని స్నేహితుడైన అతావుల్లా పేరుతో జారీ చేసిన సిమ్‌కార్డుగా రుజువుకావడంతో బుధవారం రాత్రి కర్నాటక పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అలాగే గత వారం కర్నాటకాకు చెందిన మైనర్‌ బాలికకు అభార్షన్‌ చేసిన కేసులో ఆర్‌ఎంపి ఈశ్వరమ్మతో పాటు 5 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి ఈశ్వరమ్మను అరెస్ట్ చేశారు. అలాగే గత ఐదు సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి కి సోమలకు చెందిన మహిళ ఆశ్రయం కల్పించింది. అతడు పుంగనూరులో ఆధార్‌కార్డు, ఓటరు ఐడి తీసుకుని దర్జాగా జీవిస్తుండగా వెస్ట్బెంగాల్‌ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అలాగే ముంబాయిలో జరిగిన కొన్ని ఉగ్రవాదుల కార్యకలాపాలకు సంబంధించి కలికిరి, సదుం ప్రాంతాలలో వారి అనుచరులు ఉండటంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వీటితో పాటు పట్టణంలో బయట ప్రాంతాలకు చెందిన పలువురు వచ్చి నివాసం ఉన్నట్లు ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పుంగనూరు సిమ్‌ శివాజి నగర్‌ చేరింది….

పట్టణంలోని స్టార్‌ వెహోబైల్స్ యజమాని నూర్‌ అహమ్మద్‌ సాధారణంగా ఒక ఆధార్‌కార్డుపై రెండు సిమ్‌లు యాక్టివేట్‌ చేస్తాడని తెలుస్తోంది. ఇందులో భాగంగా అతావుల్లా అనే స్నేహితుడి ఆధార్‌తో రెండు సిమ్‌కార్డులు యాక్టివేట్‌ చేసి పెట్టుకున్నాడు. ఇది తెలియని అతావుల్లా ప్రస్తుతం పోలీసులకు చిక్కాడు. నూర్‌అహమ్మద్‌కు కర్నాటకలోని శివాజి నగర్‌లో ఉన్న వెహోబైల్స్ యజమాని మిత్రుడు కావడంతో అధిక ధరలకు నూర్‌అహమ్మద్‌ ఈవిధంగా సిమ్‌కార్డులు విక్రయిస్తాడు. శివాజినగర్‌ నుంచి మాజీ ఎంపీకి జైలుకు ఈ సిమ్‌కార్డు చేరడం, పుంగనూరు వాసుల అక్రమ వ్యాపారం బట్టబయలైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

ట్రేడింగ్‌ కంపెనీల దందా….

పుంగనూరులో ట్రేడింగ్‌ కంపెనీల వారు అడ్రస్‌ తెలియని సిమ్‌కార్డులను అధిక ధరలకు డీలర్ల నుంచి కొనుగోలు చేస్తారు. వాటి ద్వారా వారు ప్రజలను మోసగించి, లక్షలు గడించడం జరుగుతోంది. ఇలాంటి కంపెనీలు పట్టణంలో 6 ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. ట్రేడింగ్‌ కంపెనీల కోసం వెహోబైల్‌షాపు యజమానులు ఒక ఆధార్‌తో రెండు సిమ్‌కార్డులు యాక్టివెట్‌ చేయడం, అమాయక ప్రజలను బలిచేయడం జరుగుతోందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది.

నిత్యం పుంగనూరులో రికవరీలు….

కర్నాటక , తమిళనాడు ప్రాంతాలలో జరిగే దొంగతనాలకు సంబంధించి పట్టణంలోని నగరివీధి, బస్టాండ్‌, బజారువీధిలో గల మూడు ప్రాంతాలలోని మూడు దుకాణాలలో ఆప్రాంత పోలీసులు రీకవరీలు చేయడం సర్వసాధారణమైంది. కర్నాటక నిందితులు పుంగనూరు దుకాణాలలో విక్రయాలు చేయడం , పోలీసులు చోరీ సొత్తును రీకవరీ చేసుకోవడం జరుగుతోంది. ప్రస్తుతం ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు వీటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అసాంఘిక కార్యక్రమాలకు చెక్‌ పెట్టాలని కోరుతున్నారు.

Tags; Punganur… a hub for anti-social activities.