August 21, 2026
Explore
బైపాస్‌రోడ్డులో స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు

బైపాస్‌రోడ్డులో స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు

August 21, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణ సమీపంలోని ఎంబిటి రోడ్డు కు అనుసంధానంగా ఏర్పాటు చేసిన బైపాస్‌రోడ్డులో ప్రమాదాలను నివారించేందుకు స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ సుబ్బరాయుడు తెలిపారు. శుక్రవారం బైపాస్‌రోడ్డులో భగత్‌సింగ్‌ కాలనీ హైవేలో ప్రమాదాలు జరగకుండ స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేశారు. గత నెలలో అదే ప్రాంతంలో ఆరు ప్రమాదాలు జరిగి , నలుగురు మృత్యువాత పడ్డారు. దీనిపై సీఐ స్పందించి స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పట్టణంలోని 8 ప్రాంతాలలో స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేసి, ప్రమాదాలు నివారించేందుకు కృషి చేస్తున్నందుకు సీఐ ని పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు.

Tags: Speed ​​breakers installed on the bypass road.