కడప ముచ్చట్లు:
రాజంపేట పట్టణంలోని సుద్ధగుంతల ప్రాంతంలో దారుణ హత్య చోటుచేసుకుంది.
చిలకాల పెంచలయ్య (64) అనే వ్యక్తిని బిల్లా నరసింహ (58) అనే వ్యక్తి కత్తితో పొడిచి పరారైనట్లు సమాచారం.
కత్తిపోట్లకు గురైన పెంచలయ్య తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి
మృతుడు, నిందితుడు ఒకే సామాజిక వర్గానికి చెందినవారిగా, పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు సమాచారం.
అయితే హత్యకు గల కారణాల పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన రాజంపేట పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags: Brutal murder in Rajampet; man stabbed to death.