-కర్నాటక పోలీసుల దర్యాప్తులో వెల్లడి
- ఖైదీలకు పుంగనూరు వాసులకు లింక్
- ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
- పుంగనూరులో కలకలం
పుంగనూరుముచ్చట్లు:
మాజీ ప్రధాని దేవేగౌడ కుమారుడు, ఎంపి ప్రజ్వల్ రేవన్న లైంగిక వేదింపుల కేసులో కర్నాటకలోని పరప్పన్న అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. జైలులో పోలీసులు తనిఖీ చేయగా సెల్‌ఫోన్ లభించింది. ఆ సిమ్‌కార్డు పుంగనూరుకు చెందినది కావడంతో కర్నాటక పోలీసులు పుంగనూరుకు వచ్చి ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. ప్రజ్వల్ రేవన్న లైంగిక వేదింపుల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. గత వారం రేవన్న గదిని పోలీసులు అనుమానంతో తనిఖీ చేశారు. ఆతనిఖీలలో ఆయన వద్ద ఆన్‌డ్రాయిడ్ ఫోన్‌ను కనుగొని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కర్నాటక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో పుంగనూరుకు చెందిన అతావుల్లా పేరుతో సిమ్‌కార్డును మంజూరు చేసినట్లు వెల్లడైంది. దీనిపై కర్నాటక పోలీసులు పుంగనూరుకు చేరుకుని అతావుల్లాను అదుపులోనికి తీసుకుని దర్యాప్తు ఛేశారు. దర్యాప్తులో నాగపాళెంకు చెందిన స్టార్ మొబైల్స్ వ్యక్తి నూర్‌అహమ్మద్ అతావుల్లా పేరుతో సిమ్‌కార్డు జారీ చేసినట్లు రుజువైంది. దీనిపై పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి , బెంగళూరుకు తీసుకెళ్లారు. కాగా పుంగనూరు నుంచి సిమ్‌కార్డు రేవన్న ఉన్న జైలుకు ఎలా వెళ్లింది…? ఎవరు తీసుకెళ్లారు..? రేవన్నకు పుంగనూరు వాసులకు లింక్ ఏమిటి…? దీని వెనుక కుట్ర , తదితర విషయాలపై పోలీసుల లోతైన దర్యాప్తు చేపట్టారు. కాగా కర్నాటక సరిహద్దుల్లో ఉన్న పుంగనూరులో ప్రముఖ నేరాలకు సంబంధించి కొందరి ప్రమేయం ఉండడం, వారిని కర్నాటక పోలీసులు అరెస్ట్లు చేయడం స్థానికులను కలవర పరుస్తోంది. ఈనెల వెహోదటి వారంలో మైనర్ బాలికకు ప్రసవం చేసిన కేసులో ఆర్‌ఎంపి ఈశ్వరమ్మను అరెస్ట్ చేశారు. ఆమె ఇంకా విడుదల కాలేదు. గత రెండేళ్ల క్రితం ఉగ్రవాదులతో లింకులు ఉన్న వ్యక్తులను పుంగనూరు సమీపంలో అరెస్ట్ చేసినట్లు ఐఎన్‌ఐ పోలీసులు ప్రకటించారు. అలాగే పలు నేరాలకు సంబంధించి పుంగనూరు వాసుల హస్తం ఉండటంతో పుంగనూరు పట్టణం ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు. పోలీసులు వీటిపై సమగ్ర దర్యాప్తు జరిపి, ప్రశాంతతకు నిలయమైన పుంగనూరులో అసాంఘిక శక్తులకు తావులేకుండ చేయాలని పలువురు కోరుతున్నారు.
Tags: Punganur SIM card for former PM Deve Gowda’s son Revanna.