నరసరావుపేట ముచ్చట్లు:
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, 2026లో భాగంగా పల్నాడు జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు, పురావస్తు మరియు మ్యూజియంల శాఖ కమీషనర్ ముత్యాలరాజు రేవు
గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయం, నరసరావుపేటలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశంనిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కృతిక శుక్లా కూడా పాల్గొన్నారు. ఓటరు నమోదు ప్రక్రియ,వాస్తవ తనిఖీ, తొలగింపులు, చేర్పులు, దోషాల సవరణ, ఫోటోల అప్డేట్ తదితర అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించి, అధికారులకు అవసరమైన దిశానిర్దేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హులైన ఓటర్లు జాబితా నుంచి మినహాయింపు పొందకుండా,సక్రమ పద్ధతుల్లో నిర్ధారణ చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల విభాగం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొని, ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు.
Tags: Review meeting on the comprehensive revision of the electoral roll – 2026…