August 20, 2026
Explore
గద్వాలలో పట్టపగలే చోరీ.. టీచర్ ఇంట్లో దొంగతనం

గద్వాలలో పట్టపగలే చోరీ.. టీచర్ ఇంట్లో దొంగతనం

August 20, 2026 | Andhra Pradesh

గద్వాల ముచ్చట్లు:

గద్వాల పట్టణంలోని 2వ వార్డులో టీచర్ దంపతుల ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లి తిరిగి వచ్చే సరికి తాళం విరిగి ఉండటాన్ని గుర్తించిన బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

చోరీలో బంగారం, నగదు అపహరణకు గురైనట్లు సమాచారం. తొలుత 5 తులాల బంగారం, ₹2.50 లక్షల నగదు పోయినట్లు చెప్పిన బాధితులు.. అనంతరం 4 తులాల బంగారం, ₹25 వేల నగదు మాత్రమే పోయినట్లు తెలిపారు.

సమాచారం అందుకున్న గద్వాల్ సీఐ టంగుటూరి శ్రీనివాస్, పట్టణ ఎస్‌ఐ కల్యాణ్ కుమార్ ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, విచారణ అనంతరం చోరీకి గురైన సొత్తు పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్‌ఐ తెలిపారు.

Tags: Daylight burglary in Gadwal… Theft at a teacher’s house.