గుజరాత్ ముచ్చట్లు:
1996లో నమోదైన రూ.20 లంచం ఆరోపణల కేసులో గుజరాత్ ప్రభుత్వానికి చెందిన ఓ క్లర్క్, ప్యూన్‌కు విధించిన శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
విద్యార్థికి ఆదాయ ధ్రువీకరణ పత్రం జారీ చేసేందుకు రూ.120 లంచం డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చాయి.
ఏసీబీ నిర్వహించిన ట్రాప్‌లో ప్యూన్ వద్ద రూ.20 స్వాధీనం చేసుకోగా.. క్లర్క్ వద్ద ఆరోపించిన రూ.100 లభించలేదు.
లంచం డిమాండ్ చేసినట్లు నిర్ధారించే స్పష్టమైన ఆధారాలు లేవని సుప్రీంకోర్టు పేర్కొంది. ఫిర్యాదుదారు వాంగ్మూలంలోనూ భిన్నతలు ఉన్నాయని ధర్మాసనం గుర్తించింది.
కేవలం రూ.20 నగదు స్వాధీనం చేసుకున్నారనే కారణంతోనే లంచం డిమాండ్, స్వీకరణ రుజువైనట్లు భావించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
దీంతో దిగువ కోర్టు, గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పులను రద్దు చేస్తూ.. క్లర్క్, ప్యూన్ ఇద్దరినీ నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేసింది.
దీంతో , 30 ఏళ్ల న్యాయ పోరాటానికి ఎట్టకేలకు తెరపడింది.
Tags: Supreme Court clears man after 30 years in Rs 20 bribery case.