ఆగస్టు 26కి జనరల్ హాలిడే ప్రకటన..
అమరావతిముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజలకు ఒక ముఖ్యమైన గమనిక. రాష్ట్రంలో మిలాద్-ఉన్-నబీ పండుగ సెలవు దినాన్ని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అంతకుముందు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఆగస్టు 25, 2026 (మంగళవారం) రోజునమిలాద్-ఉన్-నబీ సాధారణ సెలవు దినంగాప్రకటించబడింది. అయితే,చంద్రదర్శనం (చంద్రుని ఉనికి) ఆధారంగా రబీ ఉల్ అవ్వల్ నెల తేదీ మారడంతో, రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
పాత సెలవు తేదీ: ఆగస్టు 25, 2026 (మంగళవారం)
కొత్త సెలవు తేదీ: ఆగస్టు 26, 2026 (బుధవారం)
చంద్రుని క్యాలెండర్ (లూనార్ క్యాలెండర్) ప్రకారం 12వ రబీ ఉల్ అవ్వల్(మిలాద్-ఉన్-నబీ) ఆగస్టు 26వ తేదీన రానున్నందున, ప్రభుత్వం 2025 డిసెంబర్ 4న జారీ చేసిన జీఓ ఆర్.టి.నెం.2276 కు సవరణ చేస్తూ, ఆగస్టు 26వ తేదీ బుధవారం నాడు సాధారణ సెలవుదినం (General Holiday) ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (పొలిటికల్) జె. శ్యామల రావు జిఓ జారీ చేశారు.
Tags: Change in Milad-un-Nabi holiday in AP…