August 20, 2026
Explore
బీసీ రిజర్వేషన్లపై హర్షం.. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

బీసీ రిజర్వేషన్లపై హర్షం.. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

August 20, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై రాజంపేట టీడీపీ బీసీ, ముస్లిం మైనార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా తొలుత మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం CM చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.13 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. బీసీల రాజకీయ అభ్యున్నతికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.

Tags:Elation over BC reservations; milk poured over Chandrababu’s portrait.