అమరావతిముచ్చట్లు:
సీనియర్ సినీ నటి షావుకారు జానకి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారం రోజుల క్రితం శ్వాసకోశ సమస్యలతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన ఆమె.. బుధవారం రాత్రి ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 1950లో ‘షావుకారు’ చిత్రంతో నటిగా ప్రస్థానం ప్రారంభించిన ఆమె.. 400లకు పైగా చిత్రాల్లో నటించి విశేష గుర్తింపు తెచ్చుకున్నారు.
Tags: Veteran actress Sowcar Janaki critically ill.