రాయచోటి ముచ్చట్లు:
పిల్లలు ఏడుస్తున్నారని, పాలు తాగడం లేదని తాయత్తులు కట్టించడం సరికాదని పిల్లల వైద్యుడు రవి సూచించారు. చికిత్స కోసం వచ్చిన ఓ చిన్నారి ఒంటిపై తాయత్తులు ఉండటాన్ని గమనించిన వైద్యుడు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.తాయత్తుల దారాలు పిల్లల మెడకు చుట్టుకుని ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. దారాలు కట్టడం వల్ల అనారోగ్యాలు తగ్గవని, పిల్లలకు అవసరమైన వైద్య చికిత్స అందించాలని తెలిపారు. తాయత్తుల కోసం ఖర్చు చేసే డబ్బుతో పిల్లలకు పౌష్టికాహారం అందించాలని తల్లిదండ్రులకు సూచించారు.
Tags: Do not believe in superstitions regarding amulets: Pediatrician Ravi