లక్కిరెడ్డిపల్లి ముచ్చట్లు:
లక్కిరెడ్డిపల్లి మండలం కూర్నూతల గ్రామం దేవలంపల్లెలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో 15 గొర్రెలు మృతి చెందాయి. ఘటనతో గొర్రెల యజమాని తీవ్రంగా నష్టపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఘటనపై సంబంధిత అధికారులు వివరాలు సేకరించి, నష్టాన్ని అంచనా వేయాలని బాధితుడు కోరుతున్నారు. బాధిత గొర్రెల యజమానికి ప్రభుత్వం తగిన పరిహారం అందించాలని గ్రామస్తులు కోరారు.
Tags: 15 sheep die due to electrical short circuit.