మదనపల్లె ముచ్చట్లు:
రోడ్డు ప్రమాద బాధితులకు త్వరితగతిన బీమా పరిహారం అందించేందుకు ‘ఇ-డార్’ (e-DAR) నమోదు విధానంపై కంప్యూటర్ ఆపరేటర్లకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే వాహనం, బాధితుల వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో ఎలాంటి జాప్యం లేకుండా నమోదు చేయాలని సూచించారు.
కార్యక్రమంలో డీటీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ డి. రమేష్‌బాబు, ఎన్‌ఐసీ ప్రతినిధి ఎస్. ఖలీల్‌తో పాటు జిల్లా పోలీస్‌స్టేషన్ల కంప్యూటర్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags: Prompt insurance compensation for road accident victims