హడలెత్తి – షాపులు బంద్
మూడు షాపుల పై కేసులు నమోదు
మార్కాపురం ముచ్చట్లు:
కంభం మండలం లో తూనికల కొలతల శాఖ అధికారులు మంగళవారం నాడు దాడులు నిర్వహించారు. మంగళవారం అధికారులు వస్తున్నారనే ముందస్తు సమాచారం రావడం తో పలువురు వారి దుకాణములు మూసి వేశారు. మంగళవారం నాడు నిర్వహించిన దాడుల్లో మార్వాడి షాపులో తూకాల్లో తేడా, ఎం ఆర్ పి ధరల్లో అవకతవకలు నెలకొనడంతో 3 షాపులకి 19000 వేల రూపాయలు అపరాధ రుసుము విధించి కేసులు నమోదు చేశారు.ఈ సందర్బంగా తూనికల కోలతల జిల్లా అధికారి షేక్ జావీద్ మాట్లాడుతూ ఎం ఆర్ పి రేట్లపై అమ్మకాలు జరిపితే చర్యలు తప్పవనీ అన్నారు.కంభం మండలం లో దాడులు నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఈ దాడుల్లో ఎలక్ట్రికల్, ప్లంబింగ్, హార్డ్ వేర్ షాపుల పై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
Tags: Raids by Weights and Measures officials in Kambham.