August 18, 2026
Explore
శాంతిభద్రతలలో రాజీపడద్దు-ఎస్పీ ధీరజ్‌కునుబిల్లి

శాంతిభద్రతలలో రాజీపడద్దు-ఎస్పీ ధీరజ్‌కునుబిల్లి

August 18, 2026 | Andhra Pradesh

సోమలముచ్చట్లు:

శాంతిభద్రతల విషయంలో రాజీపడకుండ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ధీరజ్‌కునుబిల్లి పోలీసులను ఆదేశించారు. మంగళవారం ఆయన సోమల మండల పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో రికార్డులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రౌడీషీటర్లు, సంఘ విద్రోహశక్తులను అణచివేయాలన్నారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును పరిశీలించి, బాధితులకు సత్వర న్యాయం చేయాలన్నారు. నిర్లక్షం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారికి పలుసూచనలు చేశారు.

Tags:Do not compromise on law and order: SP Dheeraj Kunubilli