August 18, 2026
Explore
చెరువు దురాక్రమణ-అడ్డుకున్న గ్రామస్తులు

చెరువు దురాక్రమణ-అడ్డుకున్న గ్రామస్తులు

August 18, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని బోడినాయునిపల్లె చెరువు ఆక్రమణను గ్రామస్తులు అడ్డుకున్న సంఘటన మంగళవారం జరిగింది. కొంత మంది నాయకులు కలసి రెవెన్యూ అధికారులతో కుమ్మకై , ఏకంగా చెరువు కట్టను జెసిబిలతో తొలగించి, ఆక్రమించే కార్యక్రమం చేపట్టారు. గ్రామస్తులు ఫిర్యాదు చేసిన రెవెన్యూ అధికారులు రాలేదని, దీని కారణంగా గ్రామస్తులే కలసి ఏకమై దురాక్రమణను అడ్డుకున్నారు. ఆక్రమణదారులు గత్యంతరం లేక జెసిబి తీసుకుని వెనుతిరిగారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags: Encroachment of the tank – Villagers intervene to stop it.