అమరావతిముచ్చట్లు:
2025 సంవత్సరానికి గాను కేంద్రం జాతీయ క్రీడా పురస్కారాలను మంగళవారం ప్రకటించింది. 17 మందిని అర్జున అవార్డులు వరించగా.. అత్యున్నత పురస్కారమైన మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డును ఈ ఏడాది ఎవరికీ ప్రటించలేదు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని కమిటీ.. ఖేల్ రత్న అవార్డు కోసం హాకీ స్టార్ హార్దిక్ సింగ్ పేరును పరిశీలించినప్పటికీ చివరకు ఆయన ఆ రేసు నుంచి వైదొలిగారు.
17 మందికి అర్జున అవార్డుల గ్రహీతల వివరాలు
కేంద్ర ప్రభుత్వం 17 మందికి అర్జున అవార్డులు ప్రకటించింది. వీటిని పొందిన వారిలో చెస్ క్రీడాకారులు దివ్య దేశ్ ముఖ్, విదిత్ గుజరాతీ, బాక్సర్ నరేందర్, హైజంపర్ తేజస్విని శంకర్, స్పింటర్లు మహమ్మద్ అజ్మల్, ప్రియాంక, బ్యాడ్మింటన్ జంట ట్రీసా జాలీ, గాయత్రి గోపిచంద్, హాకీ ఆటగాళ్లు లాల్రెమ్సియామి, రాజ్కుమార్ పాల్, షూటర్ అఖిల్ ప్రముఖులుగా ఉన్నారు.
Tags: No Khel Ratna this time… Arjuna Awards for 17 people.