విజయవాడ ముచ్చట్లు:
విజయవాడ సమీపంలోని తాడేపల్లిలో కృష్ణానదీ తీరాన ఉన్న మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చెక్క వస్తువులు ఎక్కువగా ఉండటంతో మంటలు క్షణాల్లో వ్యాపించాయి. ఆశ్రమంలోని పేషెంట్లు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఆస్తినష్టం వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Major fire at Mantena Satyanarayana Raju’s ashram.