సమాన పనికి —సమాన వేతనం ఎక్కడా?
కోర్టు తీర్పులను సైతం లెక్కచేయని రాష్ట్ర ప్రభుత్వాలు
అమరావతి ముచ్చట్లు:
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యోగ భద్రత లేకపోవడం, ఆలస్యంగా లేదా తక్కువ వేతనాలు అందడం, పీఎఫ్-ఈఎస్‌ఐ వంటి ప్రయోజనాలు కరువవడం, మరియు ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల నుండి నిరంతర వేధింపులు లేదా తొలగింపు భయాలతో తీవ్ర మానసిక ఆందోళనను ఎదుర్కొంటున్నారు. సాటి ఉద్యోగుల చులకనా భావం వారు చేయవలసిన పనిని కూడా వీరిపై మోపడం వేధింపులు భరించలేక పోతున్నారు, ప్రభుత్వ పథకాలు ఏవి అందకపోగా పర్మినెంట్ ఉద్యోగులు మాదిరిగా అన్ని పన్నులు చెల్లించుటయే కాక వారి పిల్లల విద్యా అవసరాలలో కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు, మరి ముఖ్యంగా తల్లికి వందనం రైతు భరోసా ఇలాంటి సంక్షేమ పథకాలు ఏవి కూడా అర్హత లేకుండా పోతుంది, అలాగని సమాన పనికి సమాన వేతనం అంటున్నారే తప్ప జీతాలు పెంచారు సకాలంలో జీతాలు ఇవ్వరు, సుప్రీంకోర్టులను తీర్పులను కూడా లెక్కచేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి, ప్రతినిత్యం పెరిగే ధరలు కుటుంబాలకు కుంగదీస్తున్నాయి, ఏరోజైనా పర్మినెంట్ అవుతుంది కదా అనే ఆశతో చేసేవారు ఎందరో ఈ ఆశతోనే అప్పులు ఊబిలో ఇరుక్కుపోయి అడుక్కుతింటున్నా ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఇకనైనా వీరిపైన జాలి చూపదా ఈ రాష్ట్ర ప్రభుత్వం.
ప్రధాన సమస్యలుఉద్యోగ భద్రత లేమి: ఎప్పుడంటే అప్పుడు ఉద్యోగం నుండి తొలగించే ప్రమా్దం ఉంటుంది.
తక్కువ వేతనాలు: సమాన పనికి సమాన వేతనం దక్కకుండా చాలా తక్కువ జీతాలు ఇస్తారు.
జీతాల ఆలస్యం: ప్రతినెలా సమయానికి జీతాలు రాక కుటుంబ పోషణ భారమవుతుంది.
సౌకర్యాలు లేవు: పీఎఫ్ (PF), ఈఎస్‌ఐ (ESI), మెడికల్ లీవ్స్ వంటి కనీస చట్టపరమైన లాభాలు ఉండవు.యాజమాన్య వేధింపులు: మధ్యవర్తి ఏజెన్సీలు మరియు అధికారుల ఒత్తిళ్లతో మానసిక క్షోభ అనుభవిస్తారు.
సమాన పనికి సమాన వేతనం (Equal Pay for Equal Work) అంటే ఒకే విధమైన నైపుణ్యం, బాధ్యతలు, శ్రమతో కూడిన పనిని చేసే ఇద్దరు వ్యక్తులకు, వారిలో లింగం, కులం లేదా ఇతర వ్యత్యాసాలతో సంబంధం లేకుండా ఒకేలాంటి వేతనం చెల్లించాలనే ముఖ్యమైన కార్మిక మరియు మానవ హక్కుల భావన.
రాజ్యాంగ మరియు చట్టపరమైన అంశాలుఆదేశిక సూత్రాలు: భారత రాజ్యాంగంలోని పార్ట్-IV లోని ఆర్టికల్ 39(డి) ప్రకారం, స్త్రీ, పురుషులనే తేడా లేకుండా అందరికీ సమాన పనికి సమాన వేతనం కల్పించడం ప్రభుత్వాల బాధ్యత.
ప్రాథమిక హక్కులతో అనుసంధానం: రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వపు హక్కు), ఆర్టికల్ 15 (వివక్షతను నిషేధించడం), ఆర్టికల్ 16 (ఉద్యోగ అవకాశాలలో సమానత్వం) లకు అనుగుణంగా సుప్రీంకోర్టు ఈ సూత్రాన్ని ఒక కీలకమైన రాజ్యాంగ లక్ష్యంగా గుర్తించింది.
సమాన వేతన చట్టం, 1976: స్త్రీ, పురుషులకు ఒకే రకమైన పనిలో వేతనాల విషయంలో ఎలాంటి వివక్ష చూపకూడదని, రిక్రూట్‌మెంట్, పదోన్నతులు, శిక్షణలోనూ సమానత్వం ఉండాలని ఈ చట్టం స్పష్టం చేస్తుంది.
ఈ సూత్రం యొక్క ప్రాముఖ్యతలింగ సమానత్వం: కార్యాలయాల్లో మహిళలకు పురుషులతో సమానంగా వేతనాలు అందేలా చూస్తుంది.
సామాజిక న్యాయం: కార్మికుల మధ్య ఆర్థిక అసమానతలను తొలగించి, వారి శ్రమకు తగిన గౌరవాన్ని ఇస్తుంది.
ఉద్యోగ భద్రత: సమాజంలో అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు లభించేలా చేయడంలో తోడ్పడుతుంది.
Tags: Outsourcing employee trapped in a quagmire of debt, reduced to begging.