అనంతపురం ముచ్చట్లు:
అనంతపురం జిల్లా తాడిపత్రిలో గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు అనుమానిస్తున్న భారీ మొత్తంలో మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ సమీపంలో లారీని ఆపి తనిఖీ చేయగా ఈ అక్రమ మద్యం బయటపడింది.
తనిఖీల్లో లారీలో రహస్యంగా దాచిన సుమారు 400 ఫుల్ బాటిళ్ల గోవా మద్యాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేలా లారీలో ప్రత్యేకంగా రూపొందించిన రహస్య అరలు ఏర్పాటు చేసి, వాటిలో మద్యాన్ని దాచినట్లు తెలుస్తోంది.
అదేవిధంగా లారీలో రెండు వేర్వేరు రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లను కూడా పోలీసులు గుర్తించారు. వాటిలో ఒకటి కర్ణాటక రిజిస్ట్రేషన్ నంబర్ కాగా, మరొకటి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్‌గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ అక్రమ రవాణాపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మద్యం, లారీని పోలీసులు స్వాధీనం చేసుకుని, ఈ సరుకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి తరలిస్తున్నారు, అక్రమ రవాణాలో ఎవరెవరు ఉన్నారనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Large quantity of illegal Goa liquor seized in Tadipatri.