August 18, 2026
Explore
ఎంపిలు, ఎమ్మెల్యేలపై 4 వేల క్రిమినల్,కేసుల పెండింగ్‌

ఎంపిలు, ఎమ్మెల్యేలపై 4 వేల క్రిమినల్,కేసుల పెండింగ్‌

August 18, 2026 | Andhra Pradesh

అమికస్‌ ‌క్యూరీ నివేదిక వెల్లడి

​న్యూఢిల్లీ ముచ్చట్లు:

దేశవ్యాప్తంగా ఎంపిలు, ఎమ్మెల్యేలపై 4,192 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. పదేళ్లకు పైగా 519 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. 5 నుంచి10 ఏళ్ల మధ్య 754 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. ఎంపిలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసుల సత్వర విచారణపై అమికస్ క్యూరీ తాజాగా సుప్రీంకోర్టుకు 22వ నివేదికను సమర్పించారు. ఈ నివేదికలోని వివరాల మేరకు..సిట్టింగ్ ఎంపిలపై 335 కేసులు పెండింగ్‌లో ఉండగా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై 1,222 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మాజీ ఎంపిలపై 269 కేసులు.. మాజీ ఎమ్మెల్యేలపై 1,339 కేసులు పెండింగ్‌‌లో ఉన్నాయి. మరో 700 కేసుల దర్యాప్తు ఇంకా పూర్తికాలేదు. 360 కేసులు మూడేళ్లకు పైగా దర్యాప్తులో ఉన్నాయి. ఇక, లోక్‌సభలోని 543 మంది సభ్యుల్లో 251 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) సంస్థ నివేదిక వెల్లడించింది.

Tags: 4,000 criminal cases pending against MPs and MLAs.