August 18, 2026
Explore
ఎయిర్టెల్ యూజర్లకు షాక్.. పలు ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు

ఎయిర్టెల్ యూజర్లకు షాక్.. పలు ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు

August 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లను తొలగించింది. రూ.299, రూ.579, రూ.619, రూ.649 ధరలున్న ప్యాక్లను నిలిపివేయగా.. రూ.199, రూ.219 ఎంట్రీ లెవల్ ప్లాన్లను కొనసాగిస్తోంది. దీంతో ఇప్పటివరకు రూ.299 ప్లాన్ వాడుతున్న వినియోగదారులు ఇకపై రూ.349 ప్లాన్ను ఎంచుకోవాల్సి రావడంతో దాదాపు 16 శాతం అదనపు భారం పడనుంది. అయితే ఇది సాధారణ టారిఫ్ పెంపు కాదని, అధిక విలువ కలిగిన ప్లాన్ల వైపు వినియోగదారులను మళ్లించేందుకు చేపట్టిన ప్లాన్ హేతుబద్ధీకరణ చర్యగా బ్రోకరేజ్ సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయంతో ఎయిర్టెల్ సగటు యూజర్ ఆదాయం (ARPU) నెలకు రూ.4 నుంచి రూ.12 వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా.

Tags: Shock for Airtel users… several prepaid plans removed.