అమరావతిముచ్చట్లు:
లోక్‌సభలో 251, రాజ్యసభలో 75 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు
ప్రజాప్రతినిధులపై దేశవ్యాప్తంగా 4,192 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడి
14 రాష్ట్రాల సీఎంలపైనా కేసులు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి 89 కేసులు
ఎంపీలపై కేసుల్లో కేరళ, తెలంగాణ రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయన్న నివేదిక
దేశంలోని 28 రాష్ట్రాలకు గాను 14 రాష్ట్రాల ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అత్యధికంగా 89 కేసులు ఉండగా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన సువేందు అధికారిపై 29, కర్ణాటకకు చెందిన డీకే శివకుమార్‌పై 19 కేసులు ఉన్నాయి.
రాష్ట్రాల వారీగా చూస్తే.. కేరళలోని 20 మంది ఎంపీల్లో 19 మంది (95 శాతం) క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో 17 మంది ఎంపీల్లో 14 మంది (82 శాతం)పై కేసులున్నాయి. ఒడిశా (76 శాతం), జార్ఖండ్ (71 శాతం), తమిళనాడు (67 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 50 శాతం మంది ఎంపీలు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నట్లు నివేదిక స్పష్టం చేసింది.
ఈ కేసుల విచారణలో జాప్యాన్ని నివారించేందుకు, ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులు కేవలం ఆ కేసులనే విచారించాలని, అవి పూర్తయ్యాకే ఇతర కేసులను చేపట్టాలని హన్సారియా కోర్టుకు సూచించారు. ఛార్జి ఫ్రేమ్ చేసిన ఏడాదిలోగా కేసులను పూర్తి చేసేలా హైకోర్టులు నెలవారీగా పర్యవేక్షించాలని ఆయన సిఫార్సు చేశారు. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, కేసుల పరిష్కారంలో పురోగతి లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని నివేదిక పేర్కొంది.
Tags: Kerala and Telangana top the list for cases against MPs; 50% of MPs in AP also face cases.