అమరావతిముచ్చట్లు:
ఈనెల 16వ తేదీ నుంచి 20వతేదీ వరకు ఇంటింటి సర్వే ద్వారా ఎస్సీ/ఎస్టీ/బీసీ ఓటర్ల గుర్తింపు.
21 నుంచి 22 వతేదీ వరకు ఎస్సీ/ ఎస్టీ/ బీసీ ఓటర్లను ఓటర్ల జాబితాల్లో మార్కింగ్ చేయడం.
23న ఎస్సీ/ఎస్టీ/బీసీ ఓటర్లతో కూడిన ముసాయిదా జాబితా ప్రచురణ.
24 నుంచి 26వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ.
27 నుంచి 31 వరకు అభ్యంతరాలపై విచారణ చేసి తుది నిర్ణయం తీసుకోవడం.
సెప్టెంబరు 1 నుంచి 4వ తేదీ వరకు గ్రామ సభల్లో ఆ జాబితాల ధ్రువీకరణ.
సెప్టెంబర్ 5న ఎస్సీ/ఎస్టీ/బీసీ ఓటర్లను గుర్తించిన తుది ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ.
ముఖ్యమైన విధివిధానాలు
ఎస్సీ/ఎస్టీ/బీసీ ఓటర్లకు గుర్తింపు అధికారి ప్రతి పంచా యతీకి ఎస్సీ/ఎస్టీ/బీసీ ఓటర్ల గుర్తింపునకు గుర్తింపు అధికారిని నియమించాలి.
ఈ అధికారిని సంబంధిత పంచాయతీ కార్యదర్శి లేదా గ్రామ పంచాయతీ మినిస్టీరియల్ సిబ్బంది నుంచి జిల్లా పంచాయతీ అధికారి నియమిస్తారు.
ఓటర్ల జాబితాలో ఎస్సీ/ఎస్టీ/బీసీ ఓటర్లను ఎరుపు బాల్ పాయింట్ పెన్ తో స్పష్టంగా మార్కింగ్ చేయాలి.
Tags: Schedule released to identify SC, ST, and BC voters in Andhra Pradesh panchayats.