August 18, 2026
Explore
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రశాంత్ కిషోర్

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రశాంత్ కిషోర్

August 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(పీకే) ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం బీహార్ శాసనసభలో స్పీకర్ ప్రేమ్ కుమార్ సమక్షంలో బంకిపూర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆగస్టు 3వ తేదీన బీహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో పీకే ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

1995 నుండి బీజేపీ కంచుకోటగా ఉన్న ఈ స్థానాన్ని దక్కించుకున్న పీకే.. బీజేపీకి గట్టి దెబ్బ కొట్టి చరిత్రాత్మక ఎన్నికల రంగ ప్రవేశం చేశారు. ఆ ఎన్నికల్లో మొత్తం 64,151 ఓట్లు సాధించిన పీకే.. బీజేపీకి చెందిన నీరజ్ కుమార్‌ను 19,324 ఓట్ల తేడాతో ఓడించారు.

Tags: Prashant Kishor sworn in as MLA.