అనకాపల్లి ముచ్చట్లు:
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అనకాపల్లి జిల్లా పోలీసు శాఖకు పరవాడలోని Eisai ఫార్మాస్యూటికల్స్ సంస్థ 25 బాడీ వార్న్ కెమెరాలను సీఎస్ఆర్ (CSR) నిధుల ద్వారా విరాళంగా అందజేసింది.
జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, కెమెరాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు, పోలీసు విధి నిర్వహణకు ఆధునిక సాంకేతికతకు
ఈ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి సహకారం అందించిన Eisai ఫార్మా ప్రతినిధులు గిరీష్ దీక్షిత్ (సైట్ హెడ్), ఆనంద్ గాల్ఫాడే (అడ్మినిస్ట్రేషన్ హెడ్), మదన్ మోహన్‌లకు ఎస్పీ అభినందనలు తెలిపారు.
Tags: Eisai Pharma hands over 25 body-worn cameras to Anakapalli district police.