తిరుమల ముచ్చట్లు:
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నవంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను నేడు విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. ఈ-డిప్ కోసం 20వ తేదీ వరకు, అంగ ప్రదక్షిణ టోకెన్లు 24న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి దర్శన టోకెన్లు అదేరోజు 11 గంటలకు, వృద్ధులు, దివ్యాంగుల టోకెన్లు మధ్యాహ్నం 3 గంటలకు విడుదలవుతాయి. ₹300 టికెట్లు 25న ఉదయం 10 గంటలకు, గదుల బుకింగ్ కోటా మధ్యాహ్నం 3 గంటలకు విడుదలవుతాయి.
Tags: Tirumala Srivari Arjita Seva tickets to be released today…