March 26, 2026
Explore
సమస్య మీది – పరిష్కారం మాది: రాజంపేటలో చమర్తి ఇంటింటి పర్యటన

సమస్య మీది – పరిష్కారం మాది: రాజంపేటలో చమర్తి ఇంటింటి పర్యటన

March 26, 2026 | Andhra Pradesh

రాజంపేట ముచ్చట్లు:

రాజంపేట పట్టణంలో “సమస్య మీది – పరిష్కారం మాది” అనే నినాదంతో నియోజకవర్గ నేత చమర్తి జగన్ మోహన్ రాజు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గురువారం ఈడిగపాలెం వార్డు-2లో “చమర్తి ఇంటింటికి – తెలుగుదేశం పార్టీ” పేరుతో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్న చమర్తి, పరిష్కరించదగ్గ అంశాలను వెంటనే అధికారుల ద్వారా పరిష్కరించాలంటూ ఆదేశించారు.

మున్సిపాలిటీలో పేరుకుపోయిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు త్రాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండేలా కృషి చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ నాయకులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని చమర్తి జగన్ మోహన్ రాజు వెల్లడించారు.

Tags: The Problem Is Yours – The Solution Is Ours: Chamarthi’s Door-to-Door Campaign in Rajampet