August 12, 2026
Explore
4వ సారి కూడా ఆడపిల్ల పుట్టిందని ఆత్మహత్య చేసుకున్న బాలింత

4వ సారి కూడా ఆడపిల్ల పుట్టిందని ఆత్మహత్య చేసుకున్న బాలింత

August 12, 2026 | Andhra Pradesh

నల్గొండ ముచ్చట్లు:

నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం

మునుగోడు మండలం చీకటి మామిడి గ్రామానికి చెందిన బాలింత మమత ఆసుపత్రి ఆవరణలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది.

వారం రోజుల క్రితమే ఆమెకు ప్రసవం జరగగా వరుసగా మళ్ళీ ఆడపిల్లలు పుట్టడంతో కుటుంబంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని బంధువులు తెలిపారు. అత్తింటి వేధింపులే మమత మృతికి కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags: New mother commits suicide after giving birth to a baby girl for the fourth time.