August 12, 2026
Explore
కీసర ST కాలనీలో ఇళ్ల మధ్య “మజా వైన్స్”.. మహిళలకు రక్షణ ఎక్కడ?

కీసర ST కాలనీలో ఇళ్ల మధ్య “మజా వైన్స్”.. మహిళలకు రక్షణ ఎక్కడ?

August 12, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

కంచికచర్ల మండలం కీసర ST కాలనీలో నివాసాల మధ్యలో “మజా వైన్స్” ఏర్పాటు చేయడంతో మహిళలు, కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మందుబాబులు ఇళ్ల వైపు వస్తుండటంతో ST కాలనీ మహిళలే “మా ఇళ్ల వైపు రావద్దు” అంటూ అడ్డుకోవాల్సిన పరిస్థితి. అలా చెప్పిన మహిళలతోనే కొందరు గొడవకు దిగుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇళ్ల మధ్యలో వైన్స్‌కు అనుమతులు ఎలా ఇచ్చారు? మహిళల భద్రత, కుటుంబాల ప్రశాంతత గురించి అధికారులు పట్టించుకోవాల్సిన అవసరం లేదా?

జిల్లా ఎక్సైజ్ అధికారులు వెంటనే స్పందించి “మజా వైన్స్” లైసెన్స్, అనుమతులు, నిబంధనలను పరిశీలించాలి.

నిబంధనలకు విరుద్ధంగా ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలి

మహిళలు తమ ఇళ్ల ముందు మందుబాబులను అడ్డుకునే పరిస్థితి రావడం ఎంతవరకు సమంజసం? కీసర ST కాలనీ మహిళలకు అధికారులు సమాధానం చెప్పాలి!

Tags: “Maja Wines” amidst houses in Keesara ST Colony… Where is the safety for women?