August 12, 2026
Explore
ఢిల్లీలో హైఅలర్ట్‌.. 19 మంది ఉగ్రవాదుల ఫొటోలు విడుదల….

ఢిల్లీలో హైఅలర్ట్‌.. 19 మంది ఉగ్రవాదుల ఫొటోలు విడుదల….

August 12, 2026 | Andhra Pradesh

ఢిల్లీ ముచ్చట్లు:

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఇండియన్ ముజాహిదీన్, అల్-ఖైదా, ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థలకు చెందిన 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫోటోలతో నగరంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు ఏర్పాటు చేశారు.

వారి వివరాలు పోస్టర్లలో పొందుపరిచి, కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఎర్రకోట వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 15న జరిగే వేడుకలకు 15 నుంచి 20 వేల మంది పోలీసులు, పారామిలటరీ సిబ్బందిని మోహరించనున్నట్లు అధికారులు తెలిపారు.

Tags: High alert in Delhi… Photos of 19 terrorists released…