August 12, 2026
Explore
పట్టాలపై ట్రక్కు బ్రేక్‌డౌన్‌.. అదే సమయంలో రైలుకు గ్రీన్‌ సిగ్నల్‌!

పట్టాలపై ట్రక్కు బ్రేక్‌డౌన్‌.. అదే సమయంలో రైలుకు గ్రీన్‌ సిగ్నల్‌!

August 12, 2026 | Andhra Pradesh

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. అప్రమత్తమైన పోలీసులు, స్థానికులు

మధ్యప్రదేశ్ ముచ్చట్లు:

మధ్యప్రదేశ్ సాగర్ ప్రాంతంలో రైల్వే క్రాసింగ్‌ దాటుతుండగా ఓ భారీ ట్రక్కు అకస్మాత్తుగా బ్రేక్‌డౌన్‌ కావడంతో పట్టాలపైనే నిలిచిపోయింది. అదే సమయంలో రైలుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైలు వస్తున్న సమయంలో ట్రక్కు పట్టాలపై ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
విషయం గమనించిన పోలీసులు, స్థానికులు వెంటనే అప్రమత్తమై ట్రక్కును పట్టాల నుంచి తొలగించేందుకు ప్రయత్నించారు. రైలు రాకముందే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.
రైల్వే క్రాసింగ్‌ వద్ద భద్రతా చర్యలు మరింత పటిష్ఠం చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Tags: Truck breaks down on the tracks… and the train gets the green signal at the same time!