పీలేరు ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా పీలేరులో విషాద ఘటన చోటుచేసుకుంది.
రైలు కిందపడి 22 ఏళ్ల మహిళ మృతి చెందింది.
పీలేరు రైల్వే స్టేషన్ సమీపంలోని ఆకులవారిపల్లెకు చెందిన డేరంగుల శివకుమార్ భార్య డేరంగుల అంజమ్మ (22) మృతి చెందినట్లు సమాచారం.
కుటుంబ సభ్యుల ప్రకారం.. మంగళవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో అంజమ్మ మద్యం సేవించి ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవపడిన అనంతరం ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో రైల్వే ట్రాక్‌పైకి వెళ్లిన ఆమె.. ట్రాక్ మరమ్మతుల కోసం వెళ్తున్న రైలు ఇంజిన్ కింద పడి మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘటనపై లోకో పైలట్ ఇచ్చిన సమాచారంతో కదిరి నుంచి రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు.
అంజమ్మ మృతికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
Tags: Woman dies after falling under a train.