August 12, 2026
Explore
జిల్లా పేరు మారిన బోర్డు మారలేదు

జిల్లా పేరు మారిన బోర్డు మారలేదు

August 12, 2026 | Andhra Pradesh

పిల్లలకు నేర్పాల్సిన చోటే నిర్లక్ష్యం

కొండపల్లి బాలిక ఉన్నత పాఠశాల ముఖద్వారం లో కృష్ణాజిల్లానే

విద్యాశాఖ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం

ఇబ్రహీంపట్నం ముచ్చట్లు:

జిల్లాల పునర్విభజన జరిగి ‌ పేర్లు మారాయి… ప్రస్తుతం మళ్లీ మరికొంత పునర్విభజనకు కసరత్తులో జరుగుతున్నాయి.. అయినా కూడా ఇవేమీ మాకు పట్టవు అన్నట్లు ని‌ద్రాఅవస్తలో మునిగితేలుతున్నారు విద్యాశాఖ అధికారులు. పిల్లలకు నేర్పించాల్సిన బడిలోనే నిలువెత్తు నిర్లక్ష్యం తో విమర్శలు మూట కట్టుకుంటున్నారు…

కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాలికోనత పాఠశాల ప్రధాన ముఖ ద్వారం వద్ద ఉన్న బోర్డులో ఇప్పటికీ కృష్ణాజిల్లా పేరే దర్శనమిస్తుంది… జిల్లా పరిషత్ విభజన జరగలేదేమో… అన్న సందేహంలో ఉన్నారేమో అధికారులు ఎన్టీఆర్ జిల్లాగా మార్చలేదు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు నిద్రలేచి
పాఠశాల బోర్డు, ఆన్‌లైన్ వివరాలు తదితర అన్ని అధికారిక పత్రాల్లో జిల్లా పేరును సవరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags:The district’s name has changed, but the board has not.