August 12, 2026
Explore
ఏఐఎస్‌ఎఫ్‌ 91 వ ఆవిర్భావ దినోత్సవం

ఏఐఎస్‌ఎఫ్‌ 91 వ ఆవిర్భావ దినోత్సవం

August 12, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్‌ 91 వ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో సంఘ ఉపాధ్యక్షుడు జనార్ధన్‌ ఏఐఎస్‌ఎఫ్‌ జెండాను ఎగురవేశారు. జనార్ధన్‌ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. సంక్షేమ హాస్టళ్లలో అరకొర వసతులు, అక్రమాలపై పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు వెంకట్రమణారెడ్డి, మున్నా , హసన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags : AISF’s 91st Foundation Day