August 12, 2026
Explore
యూరియ కోసం రైతుల ఆగ్రహం

యూరియ కోసం రైతుల ఆగ్రహం

August 12, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని చదళ్ల గ్రామంలో రైతుసేవ కేంద్రంలో యూరియ కోసం రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన బుధవారం జరిగింది. యూరియ ఇస్తామని అధికారులు టోకెన్లు జారీ చేశారు. ఈ మేరకు టోకెన్లు తీసుకొచ్చిన రైతులకు కూడ యూరియ ఇవ్వకపోవడంతో ఏవో రాధ తో రైతులు వాగ్వివాదం చేశారు. యూరియ కోసం రైతులు పడుతున్న ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదని మండిపడ్డారు. ఈ సమయంలో పోలీసులు చేరుకుని రైతులను శాంతింపచేశారు.

Tags: Farmers’ anger over urea