పుంగనూరుముచ్చట్లు:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు నిరసనగా సీపీఐ పాదయాత్ర చేపట్టింది. బుధవారం సీపీఐ జిల్లా కార్యదర్శులు డాక్టర్ టి.జనార్ధన్ , సాంబశివ ల ఆధ్వర్యంలో సీపీఐ నేతలు పట్టణంలోని దోబికాలనీ, మార్కస్నగర్, ఎంబిటి రోడ్డులో పాదయాత్ర నిర్వహించారు. జనార్ధన్ మాట్లాడుతూ 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయలేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో విఫలమైందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చలగాటం ఆడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడ అదే రీతిలో సమస్యలను విస్మరించి, ఎన్నికల హామీలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ఈ సమస్యలు పరిష్కారం కోరుతూ ఈనెల 17న రైతు సమస్యలపై, 18న కార్మికుల సమస్యలపైన ఛలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. పాదయాత్రలో నేతలు వెంకట్రమణారెడ్డి, మున్నా, సూరి, దేవ, తిరుమల, రెడ్డిశేఖర్, సుమన్ తో పాటు హామాలీలు పాల్గొన్నారు.
Tags:CPI Padayatra to Resolve Issues