August 11, 2026
Explore
ఆగస్టు 15న సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ

ఆగస్టు 15న సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ

August 11, 2026 | Andhra Pradesh

సంగారెడ్డి ముచ్చట్లు:

–> సుమారు లక్ష మంది జనంతో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు

–> సభ ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమీక్ష

–> సమీక్షలో పాల్గొన్న సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్, నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, అధికారులు

–> ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటలకు సంగారెడ్డికి చేరుకోనున్న సీఎం రేవంత్

–> సాయంత్రం 4 గంటల వరకు సంగారెడ్డిలో ఉండనున్న సీఎం రేవంత్ రెడ్డి

–> జన సమీకరణ, వేదిక, భద్రతా ఏర్పాట్లపై సమావేశంలో సుదీర్ఘ చర్చ

–> సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఉత్తమ్, జగ్గారెడ్డి సూచన

–> ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి ఒక్కొక్కరికి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయనున్న సీఎం

–> సభా వేదికపై 10 మంది లబ్ధిదారులకు స్వయంగా స్మార్ట్ రేషన్ కార్డులు అందించనున్న రేవంత్ రెడ్డి

–> స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు మంత్రి ఉత్తమ్ సూచన.

Tags: CM Revanth Reddy to hold a massive public meeting in Sangareddy on August 15.