March 26, 2026
Explore
మార్కాపురం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష.

మార్కాపురం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష.

March 26, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

సమీక్షలో పాల్గొన్న మంత్రులు అనిత, జనార్ధన్‌రెడ్డి, ఉన్నతాధికారులు.. ప్రమాదం జరిగిన తీరుపై ప్రాథమిక సమాచారాన్ని సీఎంకు వివరించిన ఎస్పీ, కలెక్టర్.

ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ఉన్నారన్న అధికారులు.

ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు.. మరో 22 మంది గాయపడినట్లు అధికారుల వివరణ.

గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపిన అధికారులు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని.. బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని సీఎం చంద్రబాబు ఆదేశం.

Tags: CM Chandrababu reviews the Markapuram road accident.