పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని ఇండియన్‌బ్యాంక్ ఏర్పాటు చేసి 51 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాలు నిర్వహించారు. మంగళవారం బ్యాంక్ చీఫ్‌మేనేజర్ వెంకటేశ్వర్లును ఖాతాదారులు, సిబ్బంది కలసి సన్మానించారు. ఈ సందర్భంగా వారితో సమావేశం నిర్వహించి, ఇండియన్‌బ్యాంక్ అందిస్తున్న వివిధ సదుపాయాలను వినియోగించుకోవాలని వెంకటేశ్వర్లు కోరారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంతో ఇండియన్ బ్యాంక్ ముందంజలో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మేనేజర్ సుబ్రమణ్యం, ఖాతాదారులు జయరాంశెట్టి, బాలసుబ్రమణ్యం, అర్షద్‌బాషా, వెంకటేశులు, పటాన్‌రహీమ్, వైఆర్.కిషోర్, ముభారక్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
Tags: Indian Bank’s 51st Year