అమరావతిముచ్చట్లు:
ఈ నెల 12న ఒకే రోజు ఆకాశంలో మూడు అరుదైన ఖగోళ ఘట్టాలు ఆవిష్కృతం కానున్నాయని జీపీ బిర్లా అస్ట్రానమీ మృణాళిని తెలిపారు. బుధవారం తెల్లవారుజామున గురుడు, బుధుడు, అంగారకుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు ఒకే వరుసలో దర్శనమివ్వనున్నాయని చెప్పారు. అయితే యురేనస్‌ను బైనాక్యులర్స్‌తో, నెప్ట్యూన్‌ను టెలిస్కోప్‌తో చూడవచ్చు. అదే రోజున సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. కానీ ఇది భారతదేశంలో కనిపించదు. తగిన సోలార్ ఫిల్టర్లు లేకుండా సూర్యుడిని నేరుగా చూడరాదని హెచ్చరించారు.
Tags:Rare celestial phenomena tomorrow