August 11, 2026
Explore
ఢిల్లీలో 21 మంది మహిళా టెలికాలర్లు అరెస్ట్

ఢిల్లీలో 21 మంది మహిళా టెలికాలర్లు అరెస్ట్

August 11, 2026 | Andhra Pradesh

ఢిల్లీ ముచ్చట్లు:

అమాయకపు ప్రజలను మోసం చేసే కాల్ సెంటర్‌లో పని చేస్తున్న నిందితులు

ఢిల్లీ శివ మార్కెట్ ప్రాంతంలో మూడు మోసపూరిత కాల్ సెంటర్లు ఏర్పాటు చేసిన ఉత్తరాదికి చెందిన లలిత్ సింగ్, కులదీప్ సింగ్, అనిల్ అనే ముగ్గురు వ్యక్తులు

తెలంగాణలో నమోదైన 22 సైబర్ కేసుల్లో ఈ కాల్ సెంటర్ల పాత్రను గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు

బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధులుగా నమ్మించి, ముందుగానే సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్ ప్రకారం రకరకాల ఛార్జీల పేరిట అనేక మంది అమాయకపు ప్రజలను మోసం చేసిన సదరు కాల్ సెంటర్లు

కాల్ సెంటర్ నిర్వాహకులు పరారీలో ఉండగా, అందులో పనిచేసే 21 మంది మహిళా టెలికాలర్లు, ఓ బ్యాంకు ఖాతాదారుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

అయితే అరెస్టైన మహిళలు జగిత్యాల జిల్లా కోరుట్ల, హైదరాబాద్‌లోని సైదాబాద్, బోరబండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన వారు కావడం గమనార్హం.

Tags: 21 female telecallers arrested in Delhi.