వీరబల్లి ముచ్చట్లు:
వీరబల్లి మండలం కొట్టేగి వాండ్లపల్లి సమీపంలో 13 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
సానిపాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అక్రమ రవాణాపై సమాచారం అందడంతో అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో ఎర్రచందనం దుంగలతో పాటు స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు.
పట్టుబడ్డ వ్యక్తిని గాలివీడు మండలం తూముకుంటకు చెందిన తోట వెంకటాద్రిగా గుర్తించినట్లు రేంజర్ వైసీ రెడ్డి తెలిపారు.
స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ రూ.2,10,647 ఉంటుందని అధికారులు తెలిపారు.
Tags: 13 Red Sanders logs seized… Accused arrested.