అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలో బాలల ఉచిత మరియు నిర్బంధ విద్యాహక్కు చట్టం (RTE) 12(1)(C) ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత ప్రవేశాల మొదటి విడత లాటరీ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి.
సమగ్ర శిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ డాక్టర్ నున్నా అనూరాధ తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలో సుమారు 700 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, మొదటి విడతలో 1 కి.మీ పరిధిలోని 464 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు.
ఎంపికైన విద్యార్థుల వివరాలను తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు SMS ద్వారా పంపించడంతో పాటు అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంచారు. ఎంపికైన వారు అవసరమైన పత్రాలతో 26-03-2026 నుండి 07-04-2026 లోపు సంబంధిత పాఠశాలల్లో హాజరై ప్రవేశాలను నిర్ధారించుకోవాలని సూచించారు.
అవసరమైన పత్రాలు:
విద్యార్థి ఆధార్ కార్డు, తల్లిదండ్రుల ఆధార్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, జనన సర్టిఫికేట్, రేషన్ కార్డు, తోబుట్టువుల ఆధార్, స్టడీ సర్టిఫికేట్.
సరైన కారణం లేకుండా అడ్మిషన్లు నిరాకరిస్తే పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పూర్తి వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1800 425 8599 ను సంప్రదించవచ్చు.
5 కి.మీ పరిధిలోని విద్యార్థులకు రెండో విడత లాటరీ ఫలితాలు ఏప్రిల్ 12న విడుదల కానున్నాయి.
Tags: Results of the First Phase Lottery for Free Admissions under RTE 12(1)(C) Released