పుంగనూరుముచ్చట్లు:
డిఎస్సీలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలని, మంత్రి లోకేష్ రాజీనామ చేయాలని వైఎస్సార్‌సిపి ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన ర్యాలీ సక్సెస్ అయింది. రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డిల సొంత నియోజకవర్గ కేంద్రంలో పార్టీ శ్రేణులు వేలాది మంది ర్యాలీకి తరలివచ్చారు. తొలుత బస్టాండ్‌లోని దివంగత ముఖ్యమంత్రి రాజన్న విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు, నిరుద్యోగులు నివాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీ ఎంబిటి రోడ్డు, పోలీస్‌స్టేషన్ , గోకుల్ సర్కిల్, మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు జరిగింది. అక్కడ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లోకేష్ రాజీనామ చేయాలని….డిఎస్సీ అక్రమాలపై సిబిఐ దర్యాప్తు చేపట్టాలి…….ఇదేమిరాజ్యం… ఇదేమిరాజ్యం….. దొంగలరాజ్యం….. దోపిడి రాజ్యం అంటు యూత్ నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు మాజీ మెంబరు పోకల అశోక్‌కుమార్, నియోజకవర్గ పరిశీలకుడు జింకా వెంకటాచలపతి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణం లు మాట్లాడుతూ డిఎస్సీ అక్రమాలపై సిబిఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రతిపక్ష పార్టీలపై అక్రమ కేసులు బనాయించి, అరెస్ట్లు చేసి రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని, సూపర్-6 ని ఎందుకు అమలు చేయలేదంటు నిలధీశారు. రాష్ట్రంలో జరిగే అక్రమాలపై వైఎస్సార్‌సిపి నిరంతర పోరాటం సాగిస్తుందని, ప్రజలలో ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై అవగాహన కల్పించి తిరుగుబాటు చేసేలా పోరాడుతామని హెచ్చరించారు. ఈ ర్యాలీలో ఎంపిపిలు భాస్కర్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి, సురేంద్రరెడ్డి, జెడ్పిటిసి దామోదర్‌రాజు , సోమశేఖర్‌రెడ్డి, బోయకొండ మాజీ చైర్మన్ మిద్దింటి శంకరనారాయణ, పట్టణ పార్టీ అధ్యక్షుడు ఇర్ఫాన్, పార్టీ నాయకులు జయరామిరెడ్డి, అమరేంద్ర, రెడ్డిశ్వర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, లక్ష్మీపతిరెడ్డి, వైఎస్సార్‌సిపి సీమ జిల్లాల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్, జిల్లా వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్ అమ్ము ,యువజన నాయకులు సిద్ధిక్, హేము, బండకుమార్, మమ్ము, నూర్, అస్లాంమురాధి, నయాజ్, ఆసిఫ్, నజీర్, వేణునాయక్, మనోజ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.



Tags: YSRC rally against DSC irregularities proves successful.