- లోకేష్ రాజీనామ చేయాలి
- రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు హేమంత్‌రెడ్డి
పుంగనూరుముచ్చట్లు:
రాష్ట్రంలోని నిరుద్యోగుల జీవితాలతో చలగాటం ఆడుతున్న మంత్రి లోకేష్ తక్షణమే రాజీనామ చేయాలని , డిఎస్సీ అక్రమాలపై సిబిఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సిపి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించింది. సోమవారం రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గ కేంద్రంలో పార్టీ శ్రేణులు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు హేమంత్‌రెడ్డి , జిల్లా యూత్‌వింగ్ అధ్యక్షుడు కొత్తపల్లె చెంగారెడ్డి లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సీలో పలు అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలని, చంద్రబాబుకు నిజాయితి ఉంటే లోకేష్ చేత రాజీనామ చేయించాలని, అర్హులందరికి ఉద్యోగాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. డిఎస్సీ అక్రమాలకు స్పోర్టస్ అసోసియోషన్ కారణమని ఆరోపించారు. స్పోర్టస్ కోటాలో ఉద్యోగాలను విక్రయించి, అర్హుల జీవితాలను నాశనం చేశారన్నారు. డిఎస్సీ ఫలితాలు విడుదల చేసి మెరిట్‌లిస్ట్ ఎందుకు విడుదల చేయలేదని నిలధీశారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగులకు జీవనభృతి తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి రాగానే సూపర్-6 అమలు చేయకుండ ప్రజలను సూపర్-6 మోసాలకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు న్యాయం జరిగేదాక వైఎస్సార్‌సిపి పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపిలు భాస్కర్‌రెడ్డి, సురేంద్రరెడ్డి, పురుషోత్తంరెడ్డి, జెడ్పిటిసిలు దామోదర్‌రాజు, సోమశేఖర్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కళ్యాణ్‌భరత్ , నియోజకవర్గ కార్యదర్శి రాజేష్, ఐటివింగ్ ఇన్‌చార్జ్ ప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: Lokesh… are you playing games with the lives of the unemployed?