రాయచోటి ముచ్చట్లు:
అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని HIV/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే IEC పోస్టర్లను రాయచోటి ఆర్డీఓ శ్రీనివాసులు సోమవారం ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (APSACS), DISHA ప్రోగ్రామ్ సమన్వయంతో ప్రజా చైతన్య సేవా సంఘం (PCSS) ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అదనపు అధికారి డాక్టర్ ఎల్.రాధిక మార్గదర్శకత్వంలో హెచ్‌ఐవీ నివారణ, పరీక్షలు, సకాలంలో చికిత్స, చికిత్సా సేవలకు అనుసంధానం, అపోహలు, వివక్ష నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఆగస్టు 12 నుంచి అక్టోబర్ 12 వరకు రాష్ట్రస్థాయిలో నిర్వహించే ‘95:95:99’ ఐఈసీ ప్రచారంలో భాగంగా అన్నమయ్య జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఈ కార్యక్రమం లో PCSS ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.చెన్నారెడ్డి, ప్రాజెక్ట్ మేనేజర్ టి.స్వాతి, ఐసీటీసీ కౌన్సిలర్ ఉమాదేవి, ఎల్‌డబ్ల్యూఎస్ సిబ్బంది హరి, అశ్వని తదితరులు పాల్గొన్నారు.
Tags: HIV awareness posters unveiled in Rayachoti