August 10, 2026
Explore
కోడూరులో జైల్‌భరో.. కార్మిక, రైతు సంఘాల నాయకుల అరెస్ట్

కోడూరులో జైల్‌భరో.. కార్మిక, రైతు సంఘాల నాయకుల అరెస్ట్

August 10, 2026 | Andhra Pradesh

కోడూరు ముచ్చట్లు:

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైల్వేకోడూరులో సీఐటీయూ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పోస్ట్‌ఆఫీస్ వద్ద ధర్నా, రాస్తారోకో, జైల్‌భరో నిర్వహించారు. కార్మిక హక్కులను హరించే లేబర్ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని, కనీస వేతనం రూ.31 వేలు అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

రైతులకు గిట్టుబాటు ధర, సాగునీరు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలని, రైల్వేకోడూరులో బొప్పాయి రైతులకు కిలోకు రూ.18 ధర కొనసాగించాలని కోరారు.

ఉపాధి హామీ పథకంలో 200 పనిదినాలు, రోజుకు రూ.700 కూలి ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆందోళనలో పాల్గొన్న సీఐటీయూ, రైతు సంఘం, కేవీపీఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags: Jail Bharo’ in Koduru; leaders of labor and farmers’ unions arrested.