పుల్లంపేట ముచ్చట్లు:
పుల్లంపేట మండలం ఆర్.రాచపల్లి ఎస్టీ యానాదులకు భూములు పంచాలని బీకేఎంయూ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ఎం.జయరామయ్య మాట్లాడుతూ పేదలకు రెండు ఎకరాల ప్రభుత్వ భూమి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ధర్నాకు స్పందించిన ఎమ్మార్వో అర్హులను గుర్తించి వారికి భూములు పంపిణీ చేస్తామని బీకేఎంయూ నాయకుల సమక్షంలో హామీ ఇచ్చారు.
Tags: Lands should be distributed to the ST Yanadis.