August 10, 2026
Explore
సంబేపల్లి బీజేపీ మండల అధ్యక్షుడిగా సుంకర వెంకటేష్

సంబేపల్లి బీజేపీ మండల అధ్యక్షుడిగా సుంకర వెంకటేష్

August 10, 2026 | Andhra Pradesh

సంబేపల్లి ముచ్చట్లు:

సంబేపల్లి మండల బీజేపీ నూతన అధ్యక్షుడిగా సుంకర వెంకటేష్ నియమితులయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు పులి నరేంద్రకుమార్ రెడ్డి ఆయనను నియమించారు.

ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రేపన శివప్రసాద్ వెంకటేష్‌ను అభినందించారు. మండలంలోని ప్రతి గ్రామం, బూత్‌లో పార్టీని బలోపేతం చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు.

కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడిష దేవానంద, జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాసరాజు, సీనియర్ నాయకులు అరమటి శివగంగారెడ్డి, ఆనంద్ గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags: Sunkara Venkatesh appointed as Sambepalli BJP Mandal President.